Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark modesite support
 
Sun Aug 4 11:07:10 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz
Topics
Gallery
News
FAQ
Trips
Login
RailCal Android App
RailCal iPhone App
Post PNRPost BlogAdvanced Search

BZA/Vijayawada Junction (10 PFs)
Local Name: Bezawada
विजयवाड़ा जंक्शन
విజయవాడ జంక్షన్ / وجئے واڑہ جنکشن


Track: Triple Electric-Line

Updated: Nov 25 2023 (19:14) by AbhinavKr^~
Show ALL Trains
Railway Station Rd, Hanumanpet, Vijayawada City, NTR District ; Pincode; 520003
State: Andhra Pradesh

Elevation: 19 m above sea level
Type: Junction   Category: NSG-2
Zone: SCR/South Central   Division: Vijayawada


Number of Platforms: 10
Number of Halting Trains: 337
Number of Originating Trains: 32
Number of Terminating Trains: 32
5 Follows
Rating: 4.1/5 (850 votes)
cleanliness - good (111)
porters/escalators - good (109)
food - good (104)
transportation - excellent (107)
lodging - good (100)
railfanning - excellent (105)
sightseeing - good (106)
safety - good (108)
Show ALL Trains

Station News

Page#    Showing 1 to 20 of 823 News Items  next>>
Yesterday (17:38) ट्रेनों का परिचालन नहीं हुआ सामान्य, यात्री परेशान (www.livehindustan.com)
IR Affairs
SER/South Eastern
2947 views
0

News Entry# 563374   
  Past Edits
Aug 03 2024 (17:38)
Station Tag: Vijayawada Junction/BZA added by AdittyaaSharma^~/1421836

Aug 03 2024 (17:38)
Station Tag: Adra Junction/ADRA added by AdittyaaSharma^~/1421836

Aug 03 2024 (17:38)
Station Tag: Tatanagar Junction/TATA added by AdittyaaSharma^~/1421836

Aug 03 2024 (17:38)
Station Tag: Chakradharpur/CKP added by AdittyaaSharma^~/1421836
हावड़ा-मुंबई मेल हादसे के बाद तीनों लाइन दुरुस्त हो गईं, लेकिन दक्षिण पूर्व जोन से स्पीड कम करने के कारण ट्रेनें चक्रधरपुर से टाटानगर 3 से...
कमीशनिंग के लिए नान इंटरलॉकिंग कार्य चल रहा है। इसके कारण भोपाल मंडल से गुजरने वाली यात्री ट्रेनों के मार्ग परिवर्तित किए गए है। यह ट्रेनें...
Jul 25 (08:11) Vijayawada Railway: అమరావతి రైల్వే లైను ప్రాజెక్టుకు రైల్వేబోర్డు, నీతిఆయోగ్‌ ఆమోదం: డీఆర్‌ఎం (www.eenadu.net)
13016 views
1

News Entry# 561995   
  Past Edits
Jul 25 2024 (08:11)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158

Jul 25 2024 (08:11)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో మచిలీపట్నం-నర్సాపూర్‌ మధ్య రైల్వే లైన్‌ నిర్మాణం కోసం ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్‌ తెలిపారు. ...

Rail News
13325 views
0

Jul 25 (08:11)
NaagendraV
NaagendraV   351 blog posts
Re# 6135606-1              
విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో మచిలీపట్నం-నర్సాపూర్‌ మధ్య రైల్వే లైన్‌ నిర్మాణం కోసం ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్‌ తెలిపారు.



విజయవాడ:
...
more...
విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో మచిలీపట్నం-నర్సాపూర్‌ మధ్య రైల్వే లైన్‌ నిర్మాణం కోసం ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్‌ తెలిపారు. 2024-25 రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.9,151 కోట్లు కేటాయించిందని, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. రైల్వే బడ్జెట్‌పై ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ మీదుగా తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాలను కలుపుతూ సుమారు రూ.74వేల కోట్ల రైల్వే ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. 

‘‘కోనసీమ వాసుల కలగా ఉన్న కోటిపల్లి-నర్సాపూర్‌ మధ్య రూ.2,120 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త రైల్వే లైన్‌ కోసం ఈ ఏడాది రూ.300 కోట్లు కేటాయించారు. విజయవాడ-గూడురు మూడో లైన్‌ ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లు, కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్‌ కోసం రూ.310కోట్లు ఇచ్చారు. విజయవాడ డివిజన్‌లో నిడదవోలు, దువ్వాడ మధ్య మూడు, నాలుగు లైన్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. దీంతో పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. విజయవాడ-దువ్వాడ మధ్య ఆటోమెటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ నెలకొల్పుతున్నాం. గూడురు-విజయవాడలో ఆటోమెటిక్‌ సిగ్నలింగ్‌తోపాటు ట్రాక్‌ నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. 

అమరావతి రాజధాని ప్రాంతానికి అనుసంధానంగా కొత్త రైల్వే లైను కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికకు రైల్వే బోర్డు, నీతిఆయోగ్‌ నుంచి ఆమోదం లభించింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అమరావతిలో కొత్త రైల్వే స్టేషన్‌ నిర్మాణం కానుంది. ఏరుపాలెం నుంచి నంబూరు వరకు మొత్తం రూ.2,047 కోట్ల వ్యయంతో 56 కి.మీ రైల్వే లైన్‌ ఏర్పాటు చేయనున్నాం. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నారు.. అందులో విజయవాడ డివిజన్‌ పరిధిలో 23 స్టేషన్లు ఉన్నాయి. వీటి కోసం రూ.600 కోట్ల వరకు నిధులు మంజూరు కానున్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌ సమగ్రాభివృద్ధి కోసం రైల్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఆర్‌ఎల్‌డీఏ) సుమారు రూ. 820 కోట్ల అంచనాతో ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపింది. 

విజయవాడ డివిజన్‌ పరిధిలో రద్దు చేసిన రైళ్లలో ఇంటర్‌సిటీ వంటివి ఆగస్టు 10 నుంచి పునరుద్ధరిస్తాం. రద్దీ ఎక్కువగా ఉంటూ వెయింటింగ్‌ లిస్టు అధికంగా ఉండే ‘ట్రెయిన్‌ ఆన్‌ డిమాండ్‌’ను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చేలా తగిన నిర్ణయాలు తీసుకోవాలని రైల్వేశాఖ ఆదేశించింది’’అని డీఆర్‌ఎం నరేంద్ర వివరించారు.

#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine

Translate to English
Translate to Hindi
Jul 25 (07:57) Amaravati railway line: రూ.2 వేల కోట్లతో అమరావతి రైల్వేలైన్‌ అభివృద్ధి (www.eenadu.net)
13557 views
0

News Entry# 561986   
  Past Edits
Jul 25 2024 (07:57)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158

Jul 25 2024 (07:57)
Station Tag: Guntakal Junction/GTL added by NaagendraV/309158

Jul 25 2024 (07:57)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158

Jul 25 2024 (07:57)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ...

Rail News
13839 views
0

Jul 25 (07:59)
NaagendraV
NaagendraV   351 blog posts
Re# 6135587-1              
రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.

రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రూ.9,151 కోట్లుకృష్ణా నదిపై భారీ వంతెన డీపీఆర్‌కు రైల్వే బోర్డు, నీతిఆయోగ్‌ ఆమోదముద్ర 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని విజయవాడ స్టేషన్‌ ఆధునికీకరణ లోక్‌సభలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి 

...
more...


లోక్‌సభలో మాట్లాడుతున్న అశ్వినీవైష్ణవ్‌

ఈనాడు, దిల్లీ: రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి రైలు మార్గం అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను అభివృద్ధి చేయబోతోందని చెప్పారు. ఈ మార్గంలో కృష్ణా నదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నందున ప్రాజెక్టు వ్యయం ఇంత పెద్ద స్థాయిలో ఉందని చెప్పారు.  

బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల పూర్తి, విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ గురించి తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్‌ అడిగిన ప్రశ్నలకు, ఆ తర్వాత రైల్‌భవన్‌లో జరిగిన సమావేశంలో విలేకర్ల ప్రశ్నలకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. 



‘ఆంధ్రప్రదేశ్‌ చాలా ముఖ్యమైన రాష్ట్రం. గత పదేళ్లలో రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనన్ని నిధులు కేటాయించాం. 2009-14 మధ్య ఉమ్మడి రాష్ట్రానికి ఏటా సగటున రూ.886 కోట్లు కేటాయిస్తే, మోదీ ప్రభుత్వంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది ఒక్కటే రూ.9,151 కోట్లు కేటాయించాం. యూపీఏ హయాంలో ఏటా సగటున 72 కి.మీ. రైల్లే లైన్ల నిర్మాణం జరిగితే, మోదీ ప్రభుత్వం వచ్చాక అది 150 కి.మీ.కి పెరిగింది. రాష్ట్రంలో రైల్వేలైన్ల విద్యుదీకరణ 100% పూర్తయింది. ప్రస్తుతం ఏపీలో రూ.73,743 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అమృత్‌ పథకం కింద 73 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. గత పదేళ్లలో 743 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాం. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రూ.26,292 కోట్ల విలువైన 1,935 కి.మీ. 17 కొత్తలైన్ల నిర్మాణం కొనసాగుతోంది’ అని అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. అమరావతి రైల్వే లైనుకు సంబంధించిన డీపీఆర్‌కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఇటీవల నీతిఆయోగ్‌ ఆమోదముద్ర వేసిందన్నారు. తదుపరి దశ అనుమతులకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పురోగతి బాగుందన్నారు. ఈ లైన్‌ ఎర్రుపాలెం నుంచి ప్రారంభమై కృష్ణా నది మీదుగా అమరావతి స్టేషన్‌ నుంచి నంబూరు వరకు వెళ్తుందని మంత్రి వివరించారు. 

రైల్వేజోన్‌కు స్థలం ఇచ్చిన వెంటనే నిర్మాణం  

విశాఖపట్నం కేంద్రంగా తలపెట్టిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం కొత్తగా వేరేచోట స్థలం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ‘ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వజూపిన భూమి చెరువు ముంపు నీటిలో ఉండటంతో ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం కేటాయించాలని పాత ప్రభుత్వాన్ని నిరంతరం కోరుతూ వచ్చాం. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు విశాఖలోని డీఆర్‌ఎం కార్యాలయానికి వెళ్లి ఎలాంటి స్థలం అనువుగా ఉంటుందన్నదానిపై చర్చించారు. దీనిపై రామ్మోహన్‌నాయుడితో నేను కూడా మాట్లాడాను. త్వరగా కొత్త స్థలం గుర్తించి, స్వాధీనం చేస్తే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రికి కూడా చెప్పాం. త్వరలో అడుగులు పడతాయని ఆశిస్తున్నాం’ అని ఆయన వివరించారు. 

ప్రాజెక్టుల వేగం పెంచుతున్నాం

రైల్వే ప్రాజెక్టుల వ్యయాన్ని పంచుకొనే అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉందని.. దీంతోపాటు భూసేకరణ సమస్య గురించీ తాను ముఖ్యమంత్రితో మాట్లాడానని అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేపరంగా చాలా అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ విస్తరణ గురించి ఎంపీ కేశినేని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఆ ప్రాజెక్టు చాలా సంక్లిష్టమైంది. అమృత్‌ భారత్‌ స్టేషన్‌లో చేర్చిన దీని ఆధునికీకరణకు మాస్టర్‌ ప్లానింగ్‌ పూర్తయింది. దేశంలో అత్యధిక రద్దీ ఉండే స్టేషన్లలో ఒకటైన విజయవాడను వచ్చే 50 ఏళ్ల కాలాన్ని, సమీపంలో ఉన్న అమరావతిని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్, ఇతర ప్రాజెక్టు వివరాలను ఎంపీకి అందజేస్తాం’ అని చెప్పారు.

బెంగళూరు- విజయవాడ వందేభారత్‌!

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల జాప్యానికి కారణమేంటి? అనకాపల్లి స్టేషన్‌ను ఎప్పుడు అభివృద్ధి చేస్తారని ఎంపీ సీఎం రమేష్‌ ప్రశ్నించారు. అనకాపల్లి స్టేషన్‌ను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో చేర్చి, దాని అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు మంత్రి జవాబిచ్చారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల ఆలస్యానికి చాలా కారణాలున్నాయని, అందులో భూసేకరణలో జాప్యం అత్యంత ప్రధానమైందని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో సుహృద్భావ వాతావరణంలో పనిచేసి భూసేకరణ వేగవంతంగా జరిగేలా చూస్తామని వివరించారు. విజయవాడ, ముంబయి మధ్య దూరం ఎక్కువ కావడంతో ఆ రెండు స్టేషన్ల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బెంగళూరు - విజయవాడ మధ్య ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి ప్రకటించారు.
#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine

Translate to English
Translate to Hindi
Jul 19 (06:52) ఆయ్‌.. కూతంత గళం పెంచండి (www.eenadu.net)
16668 views
0

News Entry# 561034   
  Past Edits
Jul 19 2024 (06:52)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158

Jul 19 2024 (06:52)
Station Tag: Rajahmundry/RJY added by NaagendraV/309158

Jul 19 2024 (06:52)
Station Tag: Narasapur/NS added by NaagendraV/309158

Jul 19 2024 (06:52)
Station Tag: Kakinada Town Junction/CCT added by NaagendraV/309158
ఎంపీలందర్నీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం.. పార్లమెంటులో రాష్ట్రం గొంతు వినిపిస్తాం.. పెండింగ్‌ ప్రాజెక్టులతోపాటు అన్నీ సాధించేస్తామని వైకాపా అధినేత జగన్‌ అయిదేళ్ల క్రితం ఊదరగొట్టారు. ...

Rail News
15553 views
0

Jul 19 (06:53)
NaagendraV
NaagendraV   351 blog posts
Re# 6129508-1              
Article Source:

ఎంపీలందర్నీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం.. పార్లమెంటులో రాష్ట్రం గొంతు వినిపిస్తాం.. పెండింగ్‌ ప్రాజెక్టులతోపాటు అన్నీ సాధించేస్తామని వైకాపా అధినేత జగన్‌ అయిదేళ్ల క్రితం ఊదరగొట్టారు.

వైకాపా
...
more...
హయాంలో గాలికొదిలేసిన రైల్వే ప్రాజెక్టులుకేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో కూటమి ఎంపీలపైనే ఆశలుఈనాడు, కాకినాడ



ఎంపీలందర్నీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం.. పార్లమెంటులో రాష్ట్రం గొంతు వినిపిస్తాం.. పెండింగ్‌ ప్రాజెక్టులతోపాటు అన్నీ సాధించేస్తామని వైకాపా అధినేత జగన్‌ అయిదేళ్ల క్రితం ఊదరగొట్టారు. ఉమ్మడి జిల్లాలో మూడు లోక్‌సభ స్థానాలూ వైకాపాకు కట్టబెట్టినా అయిదేళ్లలో కీలక రైల్వే ప్రాజెక్టులతోపాటు ఏమీ సాధించలేకపోయారు. తాజా ఎన్నికల్లో అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. ఈ నెల 23న కేంద్ర వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కూటమి ఎంపీలు గళం వినిపించి.. అపరిష్కృత రైల్వే ప్రాజెక్టులను పట్టాలెక్కించేలా చొరవ చూపాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.



చుక్‌చుక్‌ బండి.. కోనసీమకు వెళ్లేదెప్పుడండీ! 

కోనసీమ ప్రాంతానికి రైలు మార్గం ఊరిస్తోంది. కేంద్రం బడ్జెట్‌లో ఎంతోకొంత నిధులు కేటాయిస్తున్నా.. గత వైకాపా ప్రభుత్వం నుంచి వాటా నిధులు విదల్చడంలో వైఫల్యంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు.  కీలకమైన కోటిపల్లి నర్సాపురం కొత్త రైలు మార్గానికి తొలిసారిగా రూ.220 కోట్లు, తర్వాత బడ్జెట్‌లో రూ.440 కోట్లు.. 2019 ఎన్నికలకు ముందు కేంద్రం మధ్యంతర బడ్జెట్‌లో రూ.200 కోట్లు, 2020 బడ్జెట్‌లో రూ.551 కోట్లు, 2021లో రూ.187 కోట్లు.. 2022, 2023 బడ్జెట్‌లో రూ.100 కోట్లు.. ఈ ఏడాది ఎన్నికల ముందు బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించారు.  రాష్ట్ర వాటా రూ.525 కోట్లు కాగా.. ఈ రైలు ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.2.69 కోట్లు మాత్రమే కేటాయించింది. కేంద్రం అడపాదడపా నిధులు ఇస్తున్నా వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో రాష్ట్ర వాటా పైసా విదల్చకుండా ప్రాజెక్టుపై ఆసక్తి చూపలేదు. దీంతో నిర్మాణంలో ఏళ్ల జాప్యంతో అంచనా వ్యయం పెరిగింది. వశిష్ఠ, వైనతేయ, గౌతమి నదులపై వంతెనలు నిర్మించాలి. నిర్మాణ పనులు పట్టాలెక్కిస్తే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ప్రజలకు రైల్వే సేవలు అందుబాటులోకి తెచ్చినట్లవుతుంది.



నవీకరణకు రాజమహేంద్రి ఎదురుచూపులు  

రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్‌కు నిత్యం 25 వేల మంది వరకు ప్రయాణికుల తాకిడి ఉంటుంది. ఇక్కడ అయిదు ప్లాట్‌ఫారాలున్నాయి. అమృత్‌ భారత్‌ కింద నవీకరణ చేయాల్సి ఉంది. ఈ పనులకు ఎన్నికల ముందు శంకుస్థాపన జరిగినా కదలికలేదు. ఆర్చి వంతెనపై రెండో రైల్వే లైను ఏర్పాటు.. హేవలాక్‌ వంతెనను పర్యాటక ప్రాంతంగా మార్చాలన్న ప్రతిపాదనలకూ మోక్షం దక్కలేదు. గోదావరిపై రోడ్డు కం రైలు వంతెన కాలపరిమితి దగ్గరపడుతున్నందున ప్రత్యామ్నాయంపైనా దృష్టిసారించాల్సిఉంది.



కోస్తాకు పచ్చజెండా ఊపితే.. 

కోస్తా రైలు మార్గానికి కేంద్రం పచ్చజెండా ఊపితే.. కాకినాడ నగరాన్ని ప్రధాన రైలు మార్గానికి అనుసంధాన ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం దొరికినట్లే.. విశాఖ- చెన్నై రైలు మార్గంలోని కాకినాడ జిల్లా అన్నవరం నుంచి కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టుతోపాటు కాకినాడ పోర్టు- కోటిపల్లి- నరసాపురం-మచిలీపట్నం-రేపల్లె- నిజాంపట్నం పోర్టులను కలుపుతూ బాపట్ల వరకు ఎన్‌హెచ్‌-216 రహదారికి అనుసంధానంగా కోస్తా రైలు మార్గం నిర్మించాలన్నది ప్రయాణికుల విన్నపం. ఇది సాకారమైతే చెన్నై- విశాఖ ప్రధాన రైలు మార్గానికి ప్రత్యామ్నాయ రైలు మార్గం ఏర్పాటవుతుంది. 50 కి.మీ వరకు దూరం తగ్గుతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకూ సౌలభ్యంగా ఉంటుందని ఉమ్మడి తూగో జిల్లా, కోకనాడ టౌన్‌ ప్రయాణికుల సంఘం అధ్యక్షులు, దక్షిణ మధ్య రైల్వే జోనల్‌ వినియోగదారుల సలహా సంఘం సభ్యులు వైడీ రామారావు ఏళ్లుగా కోరుతున్నారు. కాకినాడ-నర్సాపురం రైలు మార్గం పూర్తయ్యేలా చొరవ చూపుతానని ఎన్నికల బహిరంగ సభలో జనసేనాని భరోసా ఇవ్వడంతో ఈ ప్రభుత్వ హయాంలో సమస్యకు పరిష్కారం దొరకుతుందన్న ఆశ కనిపిస్తోంది.

కాకినాడ మార్గంపై  అంతులేని నిర్లక్ష్యం..

 

కీలకమైన కాకినాడకు ప్రధాన రైలు మార్గం అనుసంధానం కాలేదు. దీంతో ఇటు సామర్లకోట, అటు రాజమహేంద్రవరం వెళ్లాల్సి వస్తోంది. సినీ నటుడు కృష్ణంరాజు కాకినాడ ఎంపీగా ఉన్నప్పుడు ఈ రైలు మార్గానికి ఆమోదం దక్కినా.. తర్వాత ఎంపీల చొరవ లేక పథకం పడకేసింది. 2016లో ఈ రైలు మార్గానికి రూ.100 కోట్లు కేటాయించినా నిధులు విదల్చలేదు. కాకినాడ- పిఠాపురం డబ్లింగ్‌ పనులు పునఃపరిశీనలో ఉన్నాయని 2020లో అప్పటి రైల్వే మంత్రి చెప్పారు. రూ.240 కోట్లతో మంజూరైన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 25 ఏళ్లలో రూ.1,500 కోట్లు దాటేసింది. దీంతో ఈ ప్రాజెక్టుపై ఆశలు సన్నగిల్లాయి. ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు    తెరమీదికి వచ్చినా పట్టలేదు.

Translate to English
Translate to Hindi

14697 views
1

Jul 19 (07:04)
NaagendraV
NaagendraV   351 blog posts
Re# 6129508-2              
Rajahmundry to Jagdalpur new railway line is required. Direct coastal connection to Chhattisgarh and Odisha.
Translate to English
Translate to Hindi

11928 views
0

Jul 19 (09:44)
deepak.yerr~
deepak.yerr~   6455 blog posts
Re# 6129508-3              
Kotipalli Narsapur Railway line will take 3-5 hrs for completion and funds will be alloted in coming years as 3 river bridges pillars are almost completed and land is acquired for some sections.

Rajahmundry Godavari river 4th bridge should be immediately sanctioned and works takeup as traffic increased and it's bottle neck for operating trains everyday. Already modification and auto signalling works are in progress now from Kadiyam to Nidadavolu.
Translate to English
Translate to Hindi

8726 views
0

Jul 19 (20:17)
NaagendraV
NaagendraV   351 blog posts
Re# 6129508-4              
Yes. i heard that Kotipalli to amalapuram land acquisition completed.
if gridders arranging works on bridges and track laying works commenced in parallel, we can expect this track may available in 2 to 3 years. Agree new station construction and passenger amenities will take some time. Once route is opened for traffic at least goods trains will utilize.
Translate to English
Translate to Hindi
Page#    Showing 1 to 20 of 823 News Items  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy