14 pm gathishakti cargo terminals proposed in Telangana.
click here
28 July 2022 eenaadu , Telangana edition.
...
more...
ఈనాడు, దిల్లీ: ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు కింద సరకు రవాణా(కార్గో) టెర్మినళ్ల ఏర్పాటుకు తెలంగాణలో 14 కేంద్రాలను గుర్తించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బుధవారం లోక్‌సభలో తెరాస ఎంపీ జి.రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. ఇందులో సత్తుపల్లి, రామగుండం, సుల్తానాబాద్, మణుగూరు, నాగులపల్లి 1, 2, ఉప్పల్, రుద్రంపుర్, శ్రీసంత్ సేవాలాల్ మహరాజ్ స్టేషన్, జానకంపేట్, ఉప్పల్వాయ్, తిప్పర్తి, విష్ణుపురం, చిట్యాల్ ఉన్నట్లు చెప్పారు. ఇందులో ఇప్పటికే సత్తుపల్లిలో టెర్మినల్ ప్రారంభమైనట్లు వెల్లడించారు. మిగతా వాటిని 2024-25 నాటికి పూర్తిచేయాలన్నది లక్ష్యమని చెప్పారు.