Article source :
రాష్ట్ర విభజన తర్వాత.. నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పనిచేసే ఉద్యోగులు, ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో నాడు సికింద్రాబాద్ నుంచి (ప్రస్తుతం లింగంపల్లి నుంచి నడుస్తోంది) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు అది.
నాడు మేటి రైలు.. నేడు అపరిశుభ్రతకు నెలవుప్రయాణికుల అవస్థలు పట్టని రైల్వేశాఖ
...
more... ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత.. నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పనిచేసే ఉద్యోగులు, ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో నాడు సికింద్రాబాద్ నుంచి (ప్రస్తుతం లింగంపల్లి నుంచి నడుస్తోంది) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు అది. నల్గొండ, గుంటూరు, మంగళగిరి స్టాప్‌లతో విజయవాడకు ప్రయాణించే ఈ రైలుకు.. అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో గుంటూరు, విజయవాడలకు వెళ్లే రైలుగా మంచి ఆదరణ ఉంది. ఎల్‌హెచ్‌బీ బోగీలతో కూడిన ఈ రైలు గతంలో పరిశుభ్రత, నిర్వహణ పరంగానూ మేటిగా ఉండేది. అలాంటి రైలు ప్రస్తుతం నిర్వహణలో నాసిరకంగా ఉందని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. తిరిగి వచ్చే సమయంలో సమయ పాలనా ఉండడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ రైలు నిత్యం వేకువజామున 4.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి విజయవాడకు 10.30కు చేరుతుంది. తిరిగి విజయవాడలో సాయంత్రం 5.30కు బయలుదేరి రాత్రి 10.15 గంటలకు సికింద్రాబాద్, 11.20కి లింగంపల్లి చేరుతుంది. గత శుక్రవారం లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్తున్న రైలులోని సి-2 బోగీలో సీటు నంబరు 26 దగ్గర చెత్త ఉందని ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ప్రయాణికులు తెలిపారు. అదే రోజు విజయవాడ నుంచి వచ్చే సమయంలో డి-5 బోగీలోకి నీళ్లు వచ్చాయని వాపోయారు. సాధారణ బోగీలతో పాటు.. ఏసీ బోగీలు కూడా అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయని.. మరుగుదొడ్లకు వెళ్లలేని పరిస్థితి ఉందని అంటున్నారు.
నడుం నొప్పి తెస్తున్న సీట్లు..
ఈ రైలులోని సీట్ల నిర్వహణ కూడా సరిగా లేదని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. వెనక్కు వాల్చినా.. ముందుకు ఒరిగిపోతుండడంతో నాలుగైదు గంటల ప్రయాణానికే నడుం నొప్పి వస్తోందని వాపోతున్నారు. దాదాపు 40 శాతం సీట్లకు ముందు.. కాళ్లు పెట్టుకునే ‘ఫుట్‌రెస్ట్’లు లేవని చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, 5 గంటల్లో గమ్యస్థానం చేరాల్సిన రైలు.. తిరుగు ప్రయాణంలో కొన్నిసార్లు ఆలస్యంగా నడుస్తోందని పేర్కొంటున్నారు.
#BZA #GNT #GTL #VSKP #SCOR #Southcoastrailway
please wait...Translate to EnglishYO, check out this article about the new railway services in the capital of the new Andhra Pradesh state after the split. Our boy Chandrababu Naidu, the Chief Minister, decided to set up a separate train service starting from Secunderabad (currently Lingampally) to Vijayawada. This train is super convenient and cheap, especially for people traveling from Guntur and Vijayawada. It's got top-notch cleanliness and management, even the AC coaches are well-maintained. People are filing complaints about delayed schedules, though. The train leaves Lingampally at 4:40 AM and reaches Vijayawada at 10:30 AM. It returns from Vijayawada at 5:30 PM and reaches Lingampally at 11:20 PM. There have been some complaints about seat allocation and water leakage in coach C2 from Lingampally to Vijayawada. People were bummed that their complaints didn't get resolved. On the same day, there were water leaks in coach D5 from Vijayawada. Even the regular coaches and AC coaches are looking a bit messy. Commuters are saying it's a troublesome situation for passengers who can't switch seats. After a journey of 4-5 hours, people are complaining about backaches. It seems like the train needs some improvement in managing the seats too. People are just chilling, sitting back, and not really caring about the small issues during the journey.
please wait...Translate to HindiArticle source :
Rāṣṭra vibhajana tarvāt.. nūtana āndhrapradeś rājadhānilō panicēsē udyōgulu, prajala kōsaṁ nāṭi mukhyamaṃtṛi cndrabābunāyuḍu cōravatō nāḍu sikindrābād nunci (prastutaṃ lingamipalli nuncinaḍustōndi) pratyēkaṃgā ērapāṭu cēsin railu adi. Nāḍu mēṭi railu.. nēḍu apari